ఢిల్లీలో లాక్‌డౌన్ మరోవారం పొడిగింపు
దేశంలో కరోనా సెకండ్ విజృంభిస్తున్న టైమ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ రాజకీయాలు చేయలేదు. ముందస్తుగా జాగ్రత్తపడ్డారు. లాక్‌డౌన్ విధించారు. దాన్ని కఠినంగా అమలు చేశారు. మంచి ఫలితాలని సాధించారు. ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. ప్రస్తుతం అక్కడి కొవిడ్ పాజిటివిటీ రేటు 2.5శాతానికి తగ్గిపోయింది.
కేసులు తగ్గాయని క్రేజీవాల్ తొందపడటం లేదు. ముందుజాగ్రత్త చర్యగా మరోవారం పాటు (మే 31వరకు) లాక్‌డౌన్ పొడిగించారు. ఇదే తరహాలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తే మే 31 నుంచి ఆంక్షలు సడలించే (అన్‌లాక్) ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.కరోనా వైరస్ ఉద్ధృతి బలహీనపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ వైరస్‌పై విజయం సాధించినట్లు కాదు. కేవలం వ్యాప్తిని అదుపులోకి తీసుకొచ్చామని క్రేజీవాల్ అన్నారు.