తెలంగాణ పోలీసులపై నిఖిల్ కంప్లైంట్

కరోనా కట్టడి కోసం తెలంగాణలో కఠిన లాక్‌డౌన్‌ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే నిజంగా ఎమర్జెన్సీ ఉన్న పోలీసులు వదలడం లేదని సామాన్యుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. యంగ్ హీరో నితిన్ కూడా ఓ బాధితుడు అయ్యాడు. ఆ విషయం గురించి తెలియజేస్తూ.. నితిన్ ట్విట్ చేశారు. 

‘కొవిడ్‌ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి మందులు అందించేందుకు ఉప్పల్‌ నుంచి కిమ్స్‌ మినిస్టర్స్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నా కారుని ఆపేశారు. బాధితుడి వివరాలు, వైద్యుడి రాసిన మందుల చీటి చూపించినప్పటికీ పోలీసులు నన్ను అనుమతించలేదు. ఈ-పాస్‌ ఉండాల్సిందే అని చెప్పేశారు. అప్పటికీ నేను తొమ్మిదిసార్లు ప్రయత్నించినప్పటికీ సర్వర్లు డౌన్‌ కావడం వల్ల నాకు ఈ పాస్ దొరకలేదు. దాంతో మెడికల్‌ ఎమర్జెన్సీ అని చెబితే అనుమతి ఇస్తారని భావించి.. వచ్చాను’ అని నిఖిల్‌ ట్వీట్‌ పెట్టారు.

Was on the way to deliver Emergency Life saving Medicines from Uppal to Kims Minister road… Inspite of providing the Prescription and patient details.. was stopped and asked to Get an Epass.
Tried 9 times but the sever is down…
I thought medical emergencies were allowed!!! pic.twitter.com/qEVWqlJkGj— Nikhil Siddhartha (@actor_Nikhil) May 23, 2021