ప్రదీప్ ఎమోషనల్ పోస్ట్
సెలబ్రెటీలు, వారి కుటుంబ సభ్యులు కరోనా బలయ్యారు. బలవుతున్నారు. యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ(65) కూడా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ బాధలో ఉన్న ప్రదీప్ ఆదివారం తండ్రితో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రదీప్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు.
“ఐ లవ్ యూ నాన్న.. నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణమైన నీకు థాంక్యూ. నాకు గౌరవ మర్యాదలతో బతకడం నేర్పినందుకు థాంక్యూ నాన్న.. నేను ఇప్పుడు చేసేదంతా మీ గొప్పతనమే.. ఇదంతా మీకే అంకితం. నా కోసం మీరు అనుక్షణం నిలబడ్డారు. నేను చెడ్డ దారి ఎంచుకుంటే మీరు నన్ను సరిదిద్దారు. నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు.
మీ ప్రేమకంటే గొప్పది మరొకటి లేదు. మీరు నాకెప్పుడూ ప్రత్యేకమే. నా జీవితంలో నేను ఎక్కడికి వెళ్లినా.. ఎంత ఎదిగినా.. మిమ్మల్ని ప్రేమతో గుర్తుంచుకుంటా. మీరు ఎప్పుడూ కోరుకున్నట్లే.. నేను ఇకమీదట కూడా ప్రజలకు వినోదం పంచుతూ ఉంటా(మళ్లీ మనం కలిసే వరకూ). మిస్ యూ నాన్న’ అని ఎమోషనల్ అయ్యారు.