ఆచార్య.. చరణ్ కథే !

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. దీంతో సినిమాలో ఎంత సేపు కనిపిస్తారు ? ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది ? అనే విషయాలు తెలుసుకొనేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా చరణ్ పాత్రపై కొరటాల క్లారిటీ ఇచ్చారు.

“ఆచార్యలో చరణ్ ది చాలా ముఖ్యమైన పాత్ర. ఇంకా చెప్పాలంటే ఆచార్యలో మెయిన్ ఎమోషన్ చరణ్ దే. అంతే తప్ప ఏదో క్యామియోలా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు. చరణ్ ది పెట్టాలని పెట్టిన పాత్ర కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఆచార్య అనేది చరణ్ కథ. మెయిన్ పార్ట్ చరణ్ దే. చరణ్ సెకండాఫ్ అంతా ఉండొచ్చు. సినిమాలో చిరంజీవి-చరణ్ తండ్రికొడుకులు కాదు” అని క్లారిటీ ఇచ్చారు. ఇక సినిమాలో రెండో పాటగా చరణ్-పూజాహెగ్డే మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు.