సమంత మనసులో ఆ బాలీవుడ్ హీరో !

సౌత్ లో సమంత స్టార్ హీరోయిన్. అంతకుమించి. ఇప్పుడు సామ్ ‘ది ఫ్యామిలీ మెన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌కి పరిచయం కానుంది. రాజ్, డీకే ద్వయం ఈ సిరీస్‌ని తీసుకొన్నారు. మనోజ్ భాజ్‌పాయ్‌, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా సామ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా.. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఆసక్తికర్ విషయాలు పంచుకుంది.

ఏ బాలీవుడ్ హీరో సరసన నటించాలనుకుంటున్నారు? అనే ప్రశ్న ఎదురవగా వెంటనే రణ్‌బీర్ కపూర్ అని సమాధానం ఇచ్చింది సామ్‌. ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌లోని మనోజ్ భాజ్‌పాయ్ పాత్ర దక్షిణాదిలో ఏ నటుడికి సరిపోతుంది? అని అడిగితే అక్కినేని నాగార్జున అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ తెలుగులో ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు.