బుట్టబొమ్మకు 4 మిలియన్ లైకులు

అల.. రికార్డులకు అంతే లేదు. సినిమా వచ్చి యేడాది దాటిపోయినా.. ఆ సినిమాలోని పాటలు మాత్రం సరికొత్త రికార్డులని సృష్టిస్తున్నాయి. బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే హీరోయిన్. టబు, నివేదా పేతురాజు, నవదీప్, సుశాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రలో నటించారు. థమన్ సంగీతం అందించారు. హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. 2020 సంక్రాంతి కానుకగా వచ్చిన అల.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

పాటలతో రికార్డులకి తెలేపి అల.. ఆ ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బుట్టబొమ్మ సాంగ్ సరికొత్త రికార్డుని సృష్టించింది. యూట్యూబ్ లో ఈ సాంగ్  4మిలియన్ లైక్స్ సొంత చేసుకొంది. ఓ దక్షిణాది సినిమాలోని పాటకు ఇన్ని లైకులు దక్కడం ఇదే మొదటిసారి. దీంతో.. బుట్టబొమ్మ సరికొత్త రికార్డుని బన్నీ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో బుట్టబొమ్మ పోస్టర్స్ తో కేకపుట్టిస్తున్నారు. దీంతో బుట్టబొమ్మ లైకుల రికార్డ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.