కరోనా బారినపడకున్నా.. బ్లాక్ ఫంగస్ ఎటాక్ !
ఒకవైపు కరోనా కొత్త కేసులు తగ్గుతున్నవేళ.. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో పొంచి ఉన్న మరో ముప్పు బ్లాక్ ఫంగస్. కొవిడ్ కారణంగా కొందరిలో స్టిరాయిడ్ల వాడకంతో బ్లాక్ ఫంగస్ ముప్పు పొంచి ఉంది.
మొత్తంగా కరోనా పాజిటివ్ కాకపోయినా.. ఈ తరహా సమస్యలుంటే బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉంది. అనియంత్రిత మధుమేహంతో బాధపడుతున్నవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. మధుమేహంతో పాటు ఇతర వ్యాధులతో బాధపడేవారిలో బ్లాక్ ఫంగస్ బయటపడే అవకాశం ఉంది.