బీహార్ లో లాక్‌డౌన్ పొడగింపు
కరోనా సెకండ్ వేవ్ లో అస్సలు లాక్‌డౌన్ ఉండదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయ్. ఐతే రోజురోజుకి కరోనా విశ్వరూపం చూపిస్తుండటంతో.. లాక్‌డౌన్ ని ఆశ్రయించక తప్పలేదు. ప్రస్తుతం పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ లో ఉన్నాయి. అంతేకాదు.. లాక్‌డౌన్ టైమ్ ముగిసినా.. మరోసారి పొడగిస్తూ వెళ్తున్నాయి. లాక్‌డౌన్ వలన మంచి ఫలితాలు వస్తున్నాయి. అందుకే పొడగిస్తున్నామని చెబుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణ.. తదితర రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడగించాయి. ఇప్పుడీ.. ఈ జాబితాలో బీహార్ కూడా వచ్చి చేరింది.
ఇప్పటికే బీహార్ లో విధించిన లాక్‌డౌన్ మే 25తో పూర్తవుతున్నందున రాష్ట్రంలో పరిస్థితిపై సమీక్షించిన మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను జూన్ 1వరకు పొడిగిస్తున్నట్టు సీఎం ట్విటర్‌లో వెల్లడించారు. లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయని, అందుకే దీన్ని పొడిగించాలని నిర్ణయించినట్టు బీహార్ సీఎం తెలిపారు.