కండోమ్‌ టెస్టర్‌గా రకుల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీ కావాలని ఆశపడుతోంది. ఇందుకోసం రిస్క్ చేయడానికి వెనకాడటం లేదు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఒక చిత్రంలో నటించేందుకు రకుల్‌ ఇప్పటికే సంతకం చేసింది. డైరెక్టర్‌ తేజాస్‌ డోస్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఒక కండోమ్‌ టెస్టర్‌గా పనిచేసే యువతి పాత్రలో కనిపించనుందట.

ఇక నుంచి అన్నిరకాల పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా. సమాజంలో ఉన్న కొన్ని సమస్యలను సున్నితంగా ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది’ అని రకుల్‌ తాను చేయబోయే సాహసంపై పరోక్షంగా చెప్పేసింది. కండోమ్ టెస్టర్ అంటే.. బోలెడన్నీ బోల్డ్ సీన్స్ లో నటించాల్సి ఉంటుంది. తెరపై ఆ పని రకుల్ కి కొత్త. మరీ.. ఏ మేరకు రతిని రక్తికట్టిస్తుందో చూడాలి.