కేంద్రంపై క్రేజీవాల్ ఫైర్

కరోనా విషయంలో కేంద్రం సేఫ్ గేమ్ ఆడుతోంది. క్రిడెట్ ని తన ఖాతాలో.. ఫెల్యూర్ ని రాష్ట్రాల ఖాతాల్లో వేస్తోందనే విమర్శలు వస్తున్నాయ్. సెకండ్ వేవ్ లో లాక్‌డౌన్‌ పై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఆ బాధ్యతని రాష్ట్రాలకు వదిలేసింది. కరోనా వాక్సిన్ విషయంలోనూ అంతే. స్వయంగా రాష్ట్రాలు వాక్సిన్ ని సమకూర్చుకోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. 

“పాకిస్థాన్‌ మన దేశంపై దాడి చేస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోండంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను వదిలేస్తుందా ? అని సూటిగా ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ తన యుద్ధట్యాంకులు తనే కొనుక్కోవాలా! తుపాకులు గట్రా దిల్లీ ప్రభుత్వాన్నే కొనమంటారా! ఇపుడు మన దేశం యావత్తు కొవిడ్‌-19పై యుద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ సేకరణ చేపట్టకుండా మీ చావు మీరు చావండంటూ రాష్ట్రాలను ఎందుకు వదిలేస్తోంది?” అంటూ మోదీ సర్కారు వైఖరిపై క్రేజీవాల్ విరుచుకుపడ్డారు.

ఇక చిన్నారులకు టీకాలు వేసేందుకు ఫైజర్ కొవిడ్‌ టీకా సేకరణను వేగవంతం చేయాలని కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.  ‘మన చిన్నారుల కోసం సాధ్యమైనంత త్వరగా ఈ టీకాను మనం సేకరించాలి’ అని కేజ్రీవాల్ ట్వీట్‌ చేస్తూ..ఫైజర్‌పై మీడియాలో వచ్చిన కథనాన్ని జోడించారు. రాబోయే కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే వార్తల నేపథ్యంలో.. వారికి త్వరగా టీకాలు ఇవ్వాలని గత కొన్నాళ్లుగా క్రేజీవాలి కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.