కాంగ్రెస్ ని వీడనున్న రేవంత్ ? బీజేపీలో చేరనున్న ఈటెల ?
మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటెల రాజేందర్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ ? ఆయన కొత్త పార్టీ పెడతారా ? కాంగ్రెస్ లేదా భాజాపాలలో ఏదో ఒకదానిలో చేరతారా ?? అనే ప్రశ్నలు కొంతకాలంగా తెలంగాణ ప్రజలని తొలస్తున్నాయ్. ఇప్పుడీ.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. ఈటెల బీజేపీ చేరడం దాదాపు ఖాయమైంది. అతి త్వరలోనే ఆయన కమల తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈటెల భాజాపాలో చేరాలని నిర్ణయం తీసుకోవడానికి ముందు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నట్టు సమాచారమ్.
ఈటెల కోసం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలే చేశారట. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కోదండరామ్ రెడ్డిని మధ్యవర్థులుగా ఈటెల దగ్గరకు పంపాడట. అప్పుడే బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకోవద్దు. కొద్దిరోజులు ఆగండి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి ప్రకటించే వరకు ఆగమని కోరాట. ఒకవేళ రేవంత్ కు పీసీసీ పదవి దక్కకుంటే.. ఆయన బయటికొచ్చి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరామ్, ఈటెల వంటి వారితో కలిసి కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలు చేస్తున్నారంట. అంటే రేవంత్ కాంగ్రెస్ ని వీడతారన్న మాట.
అయితే రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ కు ఈటెలన్ నిర్మోహమాటంగా నో చెప్పారట. తాను బీజేపీలో చేరాలని తీసుకొన్న నిర్ణయాన్ని మార్చుకోలేనని చెప్పారట. ఈ నెల 30తో కేంద్రంలో భాజాపా అధికారంలోకి వచ్చి 7యేళ్లు పూర్తి కావొస్తోంది. ఈ సందర్భంగా ఈటెల భాజాపాలో చేరే అవకాశాలున్నట్టు సమాచారమ్. వాస్తవానికి ఈటెలకు ముందు నుంచి కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన ఉంది. ఐతే సీఎం కేసీఆర్ తనతో పాటు తన తనయుడిని కూడా టార్గెట్ చేయడం మొదలు పెట్టడంతో.. ఆయన ప్లాన్ మారినట్టు తెలుస్తోంది.