హనుమాన్ – ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం

అ! చిత్రంతో ప్రతిభ గల దర్శకుడు అనిపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత కల్కి, జాంబిరెడ్డి చిత్రాలతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘ హనుమాన్’ అనే వినూత్న కథని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.
‘ఈసారి నాకు బాగా ఇష్టమైన జానర్‌తో వస్తున్నా. హనుమాన్.. తెలుగులో తెరకెక్కుతోన్న తొలి ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం’ అని తెలిపారు ప్రశాంత్. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కొవిడ్‌తో పోరాటం చేస్తోన్న సూపర్ హీరోలకు ఈ చిత్రం అంకితం అని పేర్కొన్నారు. నటీనటులు, టెక్నికల్ బృందం వివరాలని త్వరలోనే ప్రకటించనున్నారు.