TSలో మరో 7 మెడికల్ కాలేజీలు

రాష్ట్రంలో త్వరలో మరో ఏడు వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహబూబాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూల్‌, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు కేబినేట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు కేవలం నాలుగు మెడికల్ కాలేజీలే ఉన్నాయన్న కేటీఆర్.. కేసీఆర్ ప్రభుత్వంలో 2014- 18 మధ్య ఐదు కాలేజీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. త్వరలో మరో ఏడు వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు.