కరోనా వైరస్‌.. చైనా శాస్త్రవేత్తల సృష్టే !

కరోనా వైరస్‌ చైనా శాస్త్రవేత్తల సృష్టేనని బ్రిటన్‌, నార్వేకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాకుండా అది గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు కనిపించేలా రివర్స్‌ ఇంజినీరింగ్‌కు ప్రయత్నించినట్లు స్పష్టం చేశారు. ఈ కథనం బ్రిటన్‌కు చెందిన ‘డైలీ మెయిల్‌’లో ప్రచురితం అయింది.పూర్తి నివేదిక మరికొన్ని రోజుల్లోనే సైంటిఫిక్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యేందుకు సిద్ధమైంది.

కరోనా వైరస్‌ సహజ సిద్ధంగా ఉద్భవించింది కాదని చెప్పే ప్రత్యేకమైన వేలిముద్రలు గుర్తించారు. ధనావేశితం కలిగిన నాలుగు అమైనో ఆమ్లాలు ఒకే శ్రేణిలో ఉండడాన్ని వీరు ప్రముఖంగా ప్రస్తావించారు. కేవలం కృత్రిమంగా తయారు చేస్తేనే ఇటువంటిది సాధ్యమవుతుందని వాదిస్తున్నారు.