తెలంగాణలో బెంగాల్ రాజకీయం
ఈటెల బీజేపీలో చేరికతో.. తెలంగాణలోనూ బీహార్ తరహా రాజకీయం మొదలు కాబోతుందని సమాచారమ్. నిన్నామొన్నటిదాకా మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉన్న సువేందు అధికారి ఇప్పుడు ఆమెను సవాల్ చేస్తున్నారు. ఇదే వ్యూహాన్ని బీజేపీ తెలంగాణలో అమలు చేస్తోంది. ఈటల రాజేందర్‌ని పార్టీలోకి తీసుకుని.. కేసీఆర్ వేటను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈటెల కేసీఆర్ తమ్ముడు. ఇది తెరాసలో ఉండే ప్రచారం. గులాభి పార్టీలో రహస్యాలు ఏమైనా ఉంటే.. . ముందుగా అవి ఈటల రాజేందర్‌కే తెలుస్తాయి. అలాంటి రహస్యాలు కూడా ఇప్పుడు ఈటలతో పాటు బీజేపీలోకి వెళ్తున్నాయి. వాటి ఆధారంగా బీజేపీ కేసీఆర్‌ను టార్గెట్ చేయబోతుందని సమాచారమ్. మరీ.. ఈటెలకు తెలిసిన రహస్యాలు ఏంటీ ? వాటిని ఎప్పుడు.. ఏవిధంగా బయటికి తీయబోతున్నారు అన్నది చూడాలి.