దేశంలో సగానికి తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. వరసగా నాలుగు రోజులుగా రోజూవారీ కేసులు రెండులక్షల దిగువనే నమోదయ్యాయి. రికవరీరేటు పెరుగుతోంది. క్రియాశీలరేటు తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,52,734 కొత్త కేసులు నమోదయ్యాయ్. దాదాపు 50రోజుల తరవాత కొత్త కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. 

24గంటల వ్యవధిలో 3,128మంది కరోనాతో మృతి చెందారు. వరసగా ఐదోరోజు మృతుల సంఖ్య నాలుగు వేలకు దిగువనే నమోదైంది. ఇప్పటి వరకు 2.8కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా..3,29,100మంది మహమ్మారికి బలయ్యారు. ఇక క్రియాశీలరేటు 7.58శాతానికి తగ్గగా.. రికవరీరేటు 91.25 శాతానికి పెరిగింది.