హ్యాపీ బర్త్ డే నాన్న

సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. కృష్ణ నటించిన సినిమాలు, ఆయన రేర్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రికి ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు.

“హ్యాపీ బర్త్ డే నాన్న. ఎల్లప్పుడూ తనని మంచి దారిలో నడిపించినందుకు థ్యాంక్యూ. మీరు చూసి ఉందని ప్రేమ మీపై ఉంది” అంటూ ట్విట్ చేశారు. ఇక తండ్రి బర్త్ డే సందర్భంగా అభిమానులకి గిఫ్ట్ ఇవ్వడం మహేష్ కి అలవాటు. కానీ ఈసారి మిస్ అయింది. సర్కారు వారి పాట నుంచి టీజర్ లేదా ఫస్ట్ లుక్ వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేకపోతున్నామని చిత్రబృందం మూడ్నాలుగు రోజుల ముందే క్లారిటీ ఇచ్చేసింది. 

Happy birthday Nanna.. Thank you for always showing me the best way forward.. Love you more than you’ll ever know ♥️♥️♥️ pic.twitter.com/Mm3J0OA8by— Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2021