కృష్ణ కోరికలు : మహేష్ తో పాతాళ భైర‌వి, సుధీర్ సినిమాలో హృతిక్ రోషన్

తెలుగు సినిమా ఆణిముత్యాల్లో ‘పాతాళ భైర‌వి’ ఒకటి. ఈ చిత్రాన్ని తనయుడు మహేష్ బాబుతో హిందీలో రిమేక్ చేయాలనేది కృష్ణ కోరిక. ఈ కోరిక గురించి మహేష్ కు చెప్పడం జరిగింది. కానీ మ‌హేష్ ఒప్పుకోలేదు. మ‌హేష్‌కు బాలీవుడ్ వెళ్లాల‌న్న ఆలోచ‌న లేదు. ఇక్క‌డ తాను నెంబ‌ర్ వ‌న్ గా ఉన్నాడు. అక్క‌డ‌కు వెళ్లి న‌లుగురిలో ఒక‌డిగా ఉండ‌డం ఎందుకన్న‌ది త‌న ఆలోచ‌న‌. ఐతే ఎప్పటికైనా ‘పాతాళ భైర‌వి’ హిందీలో రిమేక్ చేస్తామని ఇప్పటికీ కృష్ణ చెబుతున్న మాట.

ఇక కృష్ణలో మరో కోరిక కూడా ఉంది. అదే సుధీర్ బాబు న‌టించిన ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌ని హిందీ హృతిక్ రోష‌న్ తో తెర‌కెక్కించాలి. ప‌ద్మాల‌యా స్టూడియోస్ పై ఈసినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారు. నిజానికి లాక్ డౌన్ లేక‌పోతే ఎప్పుడో ఈ సినిమా ప‌ట్టాలెక్కేదట. అన్నట్టు.. ఈరోజు కృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీ ఎస్ మిర్చి డాట్ కామ్.