అజిత్‌కు బాంబు బెదిరింపులు

కోలీవుడ్ హీరో అజిత్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. అజిత్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు పోలీసులకి ఫోన్ కాల్ రావడంతో..వెంటనే పోలీసులు అజిత్ ఇంటికి చేరుకున్నారు. తనికీ చేయగా ఎలాంటి బాంబు లభ్యం కాలేదు. దీంతో ఇది ఆకతాయి చేసిన పని అని గుర్తించారు. ఫోన్‌కాల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో ఛేదించారు. చెన్నైలోని మరక్కన్నమ్‌లో ఉండే దినేశ్‌ ఈ బెదిరింపు కాల్‌ చేసినట్లు గుర్తించారు. ఆ వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని నిర్ధారించారు.

అజిత్‌కు బాంబు బెదిరింపు కాల్‌ రావడం ఇది రెండోసారి. తమిళనాడులోని ఇంజంబక్కమ్‌లో అజిత్‌ ఇల్లు ఉంటుంది. గతేడాది భువనేశ్‌ అనే వ్యక్తి కూడా ఇలాంటి చర్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అజిత్‌.. ‘వాలిమై’ చిత్రంలో బిజీగా ఉన్నారు. హెచ్‌.వినోద్‌ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు.