అందుకే బుమ్రాను ఆడటం కష్టం !

టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్‌ జంకుతున్నారు. టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బుమ్రా బౌలింగ్‌ ని ఆడటం ఎందుకు కష్టం అనే విషయాన్ని వివరించారు.

“విచిత్రమైన శైలి కావడం.. రన్నప్‌ తక్కువగా ఉండటం.. యాంగిల్‌ భిన్నంగా ఉండటంతో ఎలాంటి బంతులు వేస్తాడో అర్థమవ్వదు. బుమ్రా.. లసిత్‌ మలింగ తరహా బౌలర్‌. అలాంటి బౌలర్లను ఆడటం సులువు కాదు. వాళ్ల బంతులు నేరుగా పిచ్‌ అవుతాయా? స్వింగ్‌ చేస్తారా? అర్థంకాక బ్యాట్స్‌మన్‌ తికమక పడతారు. అందుకే వారు విజయవంతం అయ్యారు” అని చెప్పుకొచ్చారు.

ఇక పేస్‌ బౌలింగ్‌లో చాలా మార్పులు వచ్చాయ్. బ్యాక్‌ ఆఫ్ ది హ్యాండ్‌, ఆఫ్‌ కట్టర్‌, ఆఫ్‌ కట్టర్‌ బౌన్సర్‌, నకుల్‌ బాల్‌ వంటివి వచ్చాయన్నారు. యార్కర్లలోనే ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తున్నాయని వెంకటేష్ ప్రసాద్ తెలిపారు.