ఈటెల రాజీనామా, రేవంత్’కు పదవి.. ఒకేరోజు !

తెలంగాణ రాజకీయాల్లో రేపు రెండు కీలక పరిణామాలు జరగనున్నయ్. ఇందులో ఒకటి మాజీ మంత్రి ఈటెల టీఆర్ఎస్  కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. అదే సమయంలో భాజాపాలో చేరబోతున్నట్టు అధికారికంగా ప్రకటించనున్నారు. ఢిల్లీకి వెళ్లిన ఈటెల మూడ్రోజుల పాటు అక్కడే ఉన్నారు. భాజాపాలోని కీలక వ్యక్తులతో సమావేశం అయ్యారు. పార్టీలో చేరిక విషయంలో తనకున్న అనుమానాలు, భయాలని క్లియర్ చేసుకున్నరు. ఫైనల్ గా బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. గురువారం తిరిగి హైదరాబాద్  వచ్చిన ఈటెల రేపు  (శుక్రవారం) తెరాస, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ కు రేపు బిగ్ న్యూస్ కానుంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం ఖాయమైంది. ఆయన పేరుని రేపు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారమ్. రేవంత్ రెడ్డి విషయంలో స్వయంగా రాహుల్ గాంధీనే రంగంలోకి దిగి.. పరిస్థితులని చక్కదిద్దుతున్నారని తెలిసింది. ఆయన సీనియర్లని సర్థి చెబుతున్నారు. రేపు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరుని ప్రకటిస్తారని తెలుస్తోంది. దీంతో రేపు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. ఈ రెండు పరిణామాలు కూడా భవిష్యత్ రాజకీయాలని తీవ్రంగా ప్రభావితం చేసేవే.