భర్తతో గొడవలు.. బయటపెట్టిన సమంత !

పెళ్లి తర్వాత హీరోయిన్స్ సైడ్ పోతారు. కానీ సమంత మాత్రం పెళ్లి తర్వాత మరింత స్ట్రాంగ్ అయింది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. ఈ క్రమంలో ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్ 2 కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత.. ఎప్పటిలాగే సినిమా, పర్సనల్ విషయాలని పంచుకున్నారు. ఈ సారి భర్త నాగ చైతన్యతో గొడవలని కూడా బయటపెట్టింది.

తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయ్. అయితే ప్రతిసారి మొదట రాజీ అయ్యేది మాత్రం తానేనని చెప్పుకొచ్చింది. ఇక ప్రతి వ్యక్తి  తన ఇష్టాలేంటో తెలుసుకోవడం చాలా అవసరం. తన విషయానికి వస్తే నవ్వు, కళ్లు, తన శరీర బలం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ప్రతి రోజు ఓ గంట పాటు వ్యాయామం లేదా యోగాకు స‌మ‌యాన్ని కేటాయిస్తే … దాని వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గ‌డ‌పొచ్చ‌ని స‌మంత తెలిపారు.