ప్రేమలోపడిన అడవి శేష్

హీరో అడవి శేష్ ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు శేష్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా తన తదుపరి చిత్రాలు, వ్యక్తిగత జీవితం గురించి స్పందించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నా. పెళ్లికి మాత్రం చాలా సమయం పట్టేలా ఉందని తెలిపారు.

“నేను సింగిల్‌ మాత్రం కాదు. హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాను. ఇంతకు మించి ఎలాంటి విషయాన్ని ఇప్పుడు బయటపెట్టలేను. ఎందుకంటే.. తన వ్యక్తిగత జీవితానికి సైతం నేను గౌరవమివ్వాలనుకుంటున్నాను. తన దగ్గర పర్మిషన్‌ తీసుకున్నాక మిగతా విషయాలు బయటకు చెబుతా. ముందు ‘మేజర్’, ఆ తర్వాత ‘హిట్‌-2’ పూర్తి కావాలి. ఇవి పూర్తయిన తర్వాతే పెళ్లి” అని చెప్పుకొచ్చారు శేష్.