5జీ టెక్నాలజీ.. జుహీ చావ్లాకి రూ.20 లక్షల జరిమానా !
బాలీవుడ్ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ టెక్నాలజీలో ఉండే రేడియేషన్ వల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయని, మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్లు అధిక ప్రభావం పడుతుందని పిటిషనర్లు ఆరోపించారు.
ఈ పిటిషన్పై శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జుహీ, మరికొందరికి రూ.20లక్షల జరిమానా విధించింది.