అశ్లీల వీడియోలో ఉన్నది తాను కాదు : నటి

కొన్నిరోజుల క్రితం ఆన్‌లైన్‌లో ఓ ప్రైవేటు వీడియో లీక్‌ అయ్యింది. ఆ వీడియోలో ఉన్న మహిళ మలయాళీ నటి రమ్యానే అని అందరూ చెప్పుకున్నారు. దాంతో ఆ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. తాజాగా ఈ వీడియోపై రమ్య స్పందించారు. ఆ అశ్లీల వీడియోలో ఉన్నది తాను కాదని.. తనకి ఆ వీడియోతో ఎలాంటి సంబంధంలేదని మలయాళీ నటి రమ్యా సురేశ్‌ స్పష్టం చేశారు. వెంటనే సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. సోషల్‌మీడియాలో ఆమె ఓ భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. 

“గత కొన్నిరోజులుగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న అశ్లీల వీడియోకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. ఆన్‌లైన్‌లో ఆ వీడియో చూసిన వెంటనే షాక్‌తో కళ్లు తిరిగి పడిపోయాను. ఎందుకంటే అందులో ఉన్న అమ్మాయి రూపురేఖలు కొద్దిగా అటు ఇటుగా నాకు మాదిరిగానే ఉన్నాయి. దాంతో ఆ వీడియో చూసిన చాలామంది నుంచి నాకు అసభ్యకరమైన మెస్సేజ్‌లు వచ్చాయి. వాటిని చూసి ఎంతో బాధగా అనిపించింది. నా భర్త సపోర్ట్‌తో సైబర్‌ పోలీసులను ఆశ్రయించి.. కేసు నమోదు చేశాను” అని తెలిపింది.