తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీ రేటు !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతోంది. అయితే మరణాలు మాత్రం తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో దేశంలో 1.20లక్షల మందికి కరోనా సోకగా..3,380 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలుపుకొని దేశంలో మొత్తం కేసులసంఖ్య 2,86,94,879 చేరింది. మరణాల సంఖ్య 3,44,082కి చేరాయి. మరణాలు రేటు 1.19 శాతంగా కొనసాగుతోంది.ప్రస్తుతం దేశంలో 15,55,248 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీలరేటు 5.73 శాతానికి తగ్గింది. రికవరీరేటు 93.08 శాతానికి పెరిగింది.