తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో గత రెండ్రోజులుగా రిజిస్ట్రేషన్లు నత్తనడకగా నడుస్తున్నాయ్. సర్వర్ లో సమస్య తలెత్తడమే ఇందుకు కారణం. ఈరోజు అయితే రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో మధ్యాహ్నం వరకే ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై రిజిస్ట్రేషన్ల పరిపాలనా డీఐజీ సుభాషిణీ స్పందించారు. సర్వర్ సమస్యతో రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా సాగుతున్నాయని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఐటీ విభాగం శ్రమిస్తోందని తెలిపారు.