ప్రభాస్ హీరోయిన్ పెళ్లి ఫోటోలు.. చూశారా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి జరగడం లేదు. కానీ ఆయనతో జటకట్టిన హీరోయిన్స్ మాత్రం త్వర పడుతున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా సాహో హీరోయిన్ ఎవ్లీన్ శర్మ చేసుకొంది. దానికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడీ.. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సాహోలో కీలక పాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా తుషాన్ భిందీతో డేటింగ్ చేస్తోంది. అలా ఏడాదిగా లవ్ లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు అతడితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. మే 15న ఈ జంట పెళ్లితో ఒకటైంది. ఆ విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించింది.

యే జవానీ హే దీవాని సినిమాతో పాపులరైంది ఎవ్లీన్. ఆ తర్వాత నాటౌంకీ సాలా, మై తేరా హీరో, హిందీ మీడియం లాంటి సినిమాల్లో నటించింది. సాహో సినిమా ఆమెను సౌత్ కు పరిచయం చేసింది.