ఖిలాడీ కాపీ కాదు.. కానీ !
క్రాక్ తో హిట్ కొట్టిన మాస్ మహారాజ రవితేజని ఖిలాడీ చేసేశాడు రమేష్ వర్మ. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా అనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఖిలాడీ కాపీ కథ అని కూడా చెప్పుకుంటున్నారు. ఈ రెండు పుకార్లపై దర్శకుడు రమేష్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఖిలాడీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాదన్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేరే ఉంది. అది మంచి లవ్ స్టోరీ. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అది నా డ్రీమ్ ప్రాజెక్టు. ఆ కథ గురించి నితిన్ తో కూడా చర్చించాను. కానీ వర్కవుట్ కాలేదన్నాడు.
ఇక ఖిలాడీ కథ కాపీ కాదని చెబుతూనే ఓ తమిళ సినిమాతో పోలికలు ఉంటాయ్. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ దాదాపు సేమ్ ఉంటుంది. అదొక్కటి తప్ప.. మరో పోలిక ఉండని చెప్పుకొచ్చారు. రమేష్ వర్మ చెప్పిన దాని ప్రకారం.. ఖిలాడీ కాపీ కాదు.. పోలిక మాత్రమే అనాలేమో.. ! మొత్తానికి ఖిలాడీపై దర్శకుడికి ఇప్పుడే నమ్మకం సన్నగిల్లినట్టుంది. అందుకే అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ కాదు. కాపీ కాదు కానీ.. అంటూ.. సగం సగం మాట్లాడుతున్నాడు.
మరోవైపు ‘క్రాక్’ తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ‘ఖిలాడీ’పై భారీ ఆశలే పెట్టుకున్నారు. మళ్లీ తగ్గ కూడదు అని భావిస్తున్నారు. అయితే ఓ హిట్ తర్వాత మూడ్నాలుగు ప్లాపులు ఇవ్వడం రవితేజకు అలవాటే. కానీ ఆయన అభిమానులు మాత్రం వాటిని భరించలేకపోతున్నారు. తమ హీరో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాలని ఆశపడుతున్నారు. ఖిలాడీ హిట్ అయితే వారి ఆశలు కొత్త వరకు తీరినట్టే.