హరిహర.. కామెడీ ట్రాక్ లు కావాలి !

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇదో పీరియాడిక్ సినిమా. అయితే సినిమాలో కామెడీ ట్రాక్ లు కూడా ఉంటాయట. ఇప్పుడు.. దీని కోసం క్రిష్ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నట్టు సమాచారమ్.

క్రిష్ దగ్గర ఓ పర్మనెంట్ రైటర్ వున్నారు. కానీ ఆ రైటర్ కామెడీలో కాస్త వీక్ అని అనుమానం. ఈ నేపథ్యంలో కామెడీ ట్రాక్ లు బాగా రాయగలడు అని పేరున్న ఓ రైటర్ నుంచి పిలిచి కొన్ని సీన్లు రాయమని రిక్వెస్ట్ చేసారట. ఈ రైటర్ కూడా ఓకె అన్నాడు. ఈ హోస్ట్ రైటర్ కి డబ్బులు ఇస్తాం. కానీ క్రెడిట్ ఇవ్వం. టైటిల్ కార్డ్ వేయమని ముందుగానే చెప్పేసారట. అందుకు ఆ రైటర్ ఒప్పుకోలేదు. నో చెప్పేసి వెళ్లి పోయాడని సమాచారమ్.