థియేటర్స్ రీ ఓపెన్ ఎప్పుడంటే ?

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో తిరిగి సినిమా షూటింగ్స్ ప్రారంభం కానున్నాయ్. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్ లను అనుమతిని ఇచ్చింది. మిగితా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా షూటింగ్ లని పెద్దగా అభ్యంతరం చెప్పే పరిస్థితి అయితే లేదు. కానీ తిరిగి థియేటర్స్ ఎప్పుడు తెరచుకుంటాయ్ ? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో జులై 1 నుంచే థియేటర్స్ తెరచుకొనే అవకాశాలున్నట్టు సమాచారమ్. అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీ కాదట.. 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ రన్ కానున్నాయట.

ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కాస్త ఉదారంగా ఉన్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం థియేటర్స్ రీ ఓపెనింగ్ ని అనుమతులు ఇచ్చినా.. మొదట 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన పెట్టనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ తెరచుకోవడం చాలా ఆలస్యం కానుంది. గతంలో మాదిరిగా ఈసారి తొందరపడి థియేటర్స్ కి అనుమతులు ఇవ్వరని చెప్పుకొన్నారు. కానీ ఊహించిన దానికంటే ముందే సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్ వినిపించేలా ఉందని తెలుస్తోంది.