కౌసు మార్కెట్లు.. ఇది కూడా పట్టణ ప్రగతియే.. !
తెలంగాణ ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే పల్లె ప్రగతి1, 2 పూర్తయ్యాయ్. పల్లె ప్రగతి మాత్రమే కాదు.. పట్టణ ప్రగతిని చేపట్టారు. ఐతే ఇప్పుడీ.. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో ఒకే చోట వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
సోమవారం మెట్‌పల్లిలో రూ.2.50కోట్లతో ఏర్పాటు చేయనున్న వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో రూ.500కోట్లతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో రూ.500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా ఠంఛనుగా రూ.148కోట్ల నిధులు మున్సిపాలిటీలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.