కొత్త వేరియంట్ B.1.1.28.2 చాలా డేంజర్
కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ.. కొత్త రకాలు మాత్రం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా B.1.1.28.2 కొత్త వేరియంట్‌ను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) నిపుణులు గుర్తించారు.
ఈ వేరియంట్ వల్ల కలిగే లక్షణాలు కాస్త తీవ్రంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా B.1.1.28.2 కారణంగా శరీర బరువు కోల్పోవడం, శ్వాసకోశంలో వైరస్ గణనీయంగా పెరగడం, ఊపిరితిత్తులు దెబ్బతినఅడానికి కారణమవుతున్నట్లు పేర్కొన్నారు.