ప్రధానితో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. వెనక !
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. మరాఠా రిజర్వేషన్లు, తుపాను సాయం, టీకాలు తదితర అంశాలపై ఠాక్రే.. మోదీతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
మరాఠా రిజర్వేషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. అలా రిజర్వేషన్లు కల్పించే హక్కు కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ప్రధాని కలవడం ప్రాధాన్యతని సంతరించుకుంది.
ప్రధానిని కలవడంపై ఉద్దవ్ స్పందించారు. ప్రధాని మోదీతో తన భేటీ పూర్తిగా వ్యక్తిగతమైనది. తనకు మోదీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాజకీయంగా దూరమైనప్పటికీ.. తమ మధ్య ఇంకా మంచి సంబంధాలే కొనసాగుతున్నాయన్నారు.