ఒవైసీకి సూపర్ పంచ్ లు
దేశంలో వాక్సిన్ కొరత, ఉచిత వాక్సిన్ పై ఎంఐఎం అధినేత అధినేత అసదుద్దీన్ చేసిన విమర్శలకు భాజాపా మహిళా నేత, నటి విజయశాంతి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
‘కోవిడ్ వ్యాక్సిన్ కొరత 135 కోట్ల పైన జనాభా ఉన్నప్పుడు సహజం ఒవైసీ జీ, ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. 2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..?’
‘ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ TRS అధినేత కేసీఆర్ గార్కి చెప్పలేదా..? 25 శాతం ప్రైవేటు హాస్పిటల్స్ కి ఇవ్వటం VIP కల్చర్ అయితే, TRS రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా.? ఒవైసీ గారు’ అంటూ వరుస ట్విట్లు చేసింది రాములమ్మ.