జూన్ నుంచి పీఆర్సీ అమలు

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత మార్చి 22న శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో జూన్ నుంచి పీఆర్సీ అమలు కానుంది.
బుధవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లాక్డౌన్ నిబంధనల సడలింపు నిర్ణయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు, వ్యవసాయ భూముల డిజిటల్ సర్వేకు ఆమోదం తెలిపింది.