నా భర్తే.. నా షారుఖ్ ఖాన్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘షేర్నీ’.అడవి నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని అమిత్ మసుర్కర్ దర్శకత్వం వహించారు. జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది విద్యా.
ఈ సందర్భంగా ఓ అభిమాని.. సల్మాన్, షారుఖ్‌లో ఒకరిని ఎంపిక చేసుకోవాలంటే ఎవరిని ఎంచుకుంటారు ? అని ప్రశ్నించగా.. తన భర్త సిదార్థ రాయ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి.. ఇతడే నా ఎస్‌ఆర్‌కే (షారుఖ్‌ఖాన్) అని ఫన్నీగా బదులిచ్చారు. ఆమె రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.