సామ్ నుంచి మరో వెబ్ సిరీస్

స్టార్ హీరోయిన్ సమంత ‘ది ఫ్యామిలీమెన్‌ 2’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇందులో రాజీ అనే తమిళ ఈలం సోల్జర్‌గా కనిపించింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సమంత కాదు. చిరుతని చూశామని చెప్పుకుంటున్నారు. అయితే సామ్ నుంచి మరో వెబ్ సిరీస్ రాబోతున్నట్టు సమాచారమ్. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌.. సామ్‌తో ఓ భారీ వెబ్‌సిరీస్‌ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ బృందం సమంతతో చర్చలు ప్రారంభించిందని, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి కనబరుస్తుందని ప్రచారం వినిపిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని సమాచారం. త్వరలో దీనిపై మరింత స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం సమంత గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శకుంతలం’ అనే పౌరాణిక చిత్రంలో నటిస్తోంది.