హిందీ మాస్టర్’గా సల్మాన్ ?
విజయ్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘మాస్టర్’. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. ఇప్పుడీ.. ఈ సినిమా బాలీవుడ్ కి వెళ్లనుందని సమాచారమ్. ఈ చిత్రాన్ని ఎండెమోల్ షైన్ ఇండియా, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, నిర్మాత మురాద్ ఖేతానీ కలిసి హిందీలో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటింబోతున్నట్లు సమాచారం. సల్మాన్ ‘మాస్టర్’ చిత్రాన్ని చూసి రీమేక్‌లో నటించడానికి అంగీకారం కూడా తెలిపారట. ‘రాధే’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సల్మాన్ ప్రస్తుతం ‘అంతిమ్’, ‘టైగర్ 3’, ‘కబీ ఈద్ కబీ దివాలీ’, ‘కిక్2’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి పూర్తయిన తర్వాతే ఆయన మాస్టర్ గా మారనున్నారని తెలుస్తోంది.