ఢిల్లీలో మరిన్ని సడలింపులు

లాక్‌డౌన్‌ సహా, ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఢిల్లీలో మరిన్ని సడలింపులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ తెలిపారు. 

  • జూన్‌ 14వ తేదీ నుంచి 50శాతం సామర్థ్యంతో రెస్టారంట్లు తెరుచుకోవచ్చు.
  • మున్సిపల్‌ జోన్స్‌లో వారాంతపు మార్కెట్‌లకు కూడా అనుమతి 
  • ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్‌-ఏ అధికారులు 100శాతం హాజరు కావాలి. 
  • మిగిలిన వాళ్లు 50శాతం విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.
  • ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సామర్థ్యంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే పనిచేయాలి.
  • వివాహాలు, అంత్యక్రియలు తదితర కార్యక్రమాల్లో 20మందికి మించి ఉండరాదు.
  • దిల్లీ మెట్రో, బస్సులు 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో పనిచేస్తాయి.
  • ప్రజా రవాణా ఆటోలు, ఇ-రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్స్‌లలో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి. మ్యాక్సీ క్యాబ్‌లో 5గురు, ఆర్‌టీవీలో 11మంది ప్రయాణించవచ్చు.
  • అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణికులు, సరకు రవాణాలకు ఎలాంటి నిబంధనలు లేవు. ప్రత్యేక అనుమతులు, ఇ-పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు.