రూపాయికే లీటరు పెట్రోల్.. ఎక్కడో తెలుసా ?
దేశంలో పెట్రో ధరలు మండి పోతున్నారు. ఇప్పటికే లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలకి చేరింది. ఇలాంటి టైమ్ లో రూపాయికే లీటర్ పెట్రోల్ వస్తే జనాలు ఊరుకుంటారా ? బంకు ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించడం ఖాయం. ఇప్పుడు మహారాష్ట్రలో ఇదే జరుగుతోంది. మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమం చేపట్టింది డోంబివలీ యువసేన. ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో ఈ అవకాశం కల్పించింది.
మరోవైపు మహారాష్ట్రలోనే అంబర్నాథ్ వింకో నకాలోని ఓ పెట్రోల్‌బంక్‌లో లీటరు పెట్రోల్ రూ.50కే అందించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య వచ్చినవారికి ఈ సదుపాయం కల్పించారు. యువరాజు పుట్టినరోజున మహారాష్ట్ర ప్రజలని మస్త్ ఖుషి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్. గిట్లనే ప్రతిరోజూ రూపాయికే లీటరు పెట్రోల్ పోస్తే ఎంత బాగుణ్ను అంటున్నారు జనాలు.