వకీల్ సాబ్.. రీ రిలీజ్

వకీల్ సాబ్ మరోసారి థియేటర్స్ లో సందడి చేయబోతున్నట్టు సమాచారమ్. వ‌కీల్ సాబ్ రికార్డు వ‌సూళ్లు గ్యారెంటీ అనుకుంటున్న ద‌శ‌లో.. క‌రోనా సెకండ్ వేవ్ బాక్సాఫీసుని ముంచేసింది. థియేట‌ర్ల మూత వ‌ల్ల‌… వ‌కీల్ సాబ్ జోరు అర్థాంత‌రంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు వ‌కీల్ సాబ్ ని మ‌ళ్లీ రీ రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో త్వ‌ర‌లోనే థియేట‌ర్లు మ‌ళ్లీ తెర‌చుకోనున్నాయ్. జులై 1 నుంచే థియేటర్స్ ఓపెన్ అవుతాయని అంటున్నారు. అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో. 50 శాతం ఆక్యుపెన్సీతో పెద్ద సినిమాలు విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ఆలోచిస్తారు. చిన్న సినిమాలు వ‌చ్చినా, పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌దు. ఈ గ్యాప్ ని వ‌కీల్ సాబ్ తో ఫిల్ చేయాల‌న్న‌ది దిల్ రాజు ప్లాన్ అని తెలిసింది. థియేటర్స్ లో సందడి చేసిన వకీల్ సాబ్.. ఓటీటీలోకి వచ్చేశాడు. ఇప్పుడు.. మరోసారి థియేటర్స్ లోకి రాబోతున్నాడు.