కొత్త కాన్సెప్ట్.. కొత్త మామ !

కాన్సెప్ట్ కథలతో హిట్స్ కొట్టడం దర్శకుడు మారుతి మార్క్.  ‘భలే భలే మగాడివోయ్’ నుంచి ఈ కాన్సెప్ట్స్ లని ఫాలో అవుతున్నాడు.సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిన్న సినిమాకు మారుతి దర్శకత్వ పర్యవేక్షణ, ఆయన టీమ్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భలేభలే మగాడివోయ్, మహానుభావుడు, బాబు బంగారం ల మాదిరిగా ఓ కాన్సెప్ట్ తో ఈ సినిమా తయారలవుతోంది. ఈ సినిమాలో మామా పాత్ర కోసం అజయ్ ఘోష్ ని తీసుకున్నారట.

 తెలుగు సినిమాల్లో మామ పాత్ర అనగానే.. మురళీ శర్మ, రావు రమేష్, సత్యరాజ్.. పేర్లు వినిపిస్తాయ్. కానీ మారుతి మాత్రం ఈసారి నటుడు అజయ్ ఘోష్ కు భలే చాన్స్ ఇచ్చారు.హీరోతో సమానమైన మామగారి పాత్రను అజయ్ ఘోష్ కు ఇచ్చారు. పాత్రలో నటుడు కనిపించకూడదు, కొత్తగా వుండాలని అజయ్ ఘోష్ ను తీసుకున్నారట. మరీ.. ఆ పాత్రక్ అజయ్ యోష్ ఏ మేరకు న్యాయం చేస్తారన్నది చూడాలి.