‘నారప్ప’ విడుదలకు రెడీ
ఈసారి లాక్ డౌన్ తర్వాత తొలి అడుగు వేసేది ఎవరు ? ఏ సినిమా ముందు థియేటర్స్ లోకి రానుంది ?? అన్నది ఆసక్తిగా మారింది. నాగ చైతన్య-సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కి రెడీగా ఉంది. 50 శాతం ఆక్యుపెన్సీతో.. తెలంగాణలో థియేటర్లు ఓపెన్ అయిపోయాయి. ఐతే నిర్మాతలు 100 శాతం ఆక్యుపెన్సీ కోసం ఎదురు చూస్తున్నారు.
జులై రెండో వారంలో.. ఆ అవకాశం రావొచ్చు. 100 శాతం ఆక్యుపెన్సీ అవకాశం ఎప్పుడొస్తుందో.. అప్పుడే లవ్ స్టోరీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లవ్ స్టోరీతో పాటు నారప్ప రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందు రిలీజ్ కానుంది అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. బాక్సాఫీస్ వద్ద మామ-అల్లుల్లు పోటీ పడకపోవచ్చు. కనీసం ఒకట్రెండు వారాల గ్యాప్ తో వచ్చే అవకాశాలున్నాయ్.