మరోసారి గదినే నమ్ముకున్నాడు
‘రాజుగారి గది’తో దర్శకుడిగా మారాడు ఓంకార్. అది హిట్ అవ్వడంతో 2, 3 గదులని కూడా తీసుకొచ్చాడు. కానీ తొలి సినిమా చూపించినంత ఎఫెక్ట్ మిగిలిన రెండు సినిమాల్లోనూ రాలేదు. పార్ట్ 2లో నాగార్జునని తీసుకొచ్చినా, పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. పార్ట్ 3 అయితే తమ్ముడ్ని హీరోగా నిలబెట్టుకునే ప్రయత్నం కనిపించింది.
ఇప్పుడు నాల్గో గదిపై అధికారిక ప్రకటన చేశాడు ఓంకార్. రాజుగారి గది 4
కూడా తీస్తానని ప్రకటించాడు. కథ సిద్ధమైందని, తన తమ్ముడే హీరో అని డిక్లేర్ చేశాడు. వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతున్నా ఓంకార్ ఎందుకో రాజుగారి గదినే నమ్ముకున్నాడు. హారర్ కామెడీ సినిమాల కాలం చెల్లిపోయింది. అయినా.. ఆ జోనర్ ని ఆ టైటిల్ ని మాత్రం ఓంకార్ వదలడం లేదు. కనీసం టైటిల్ మార్చిన కొత్త సీసాలో పాత రసం అన్నట్టుగా ఉంటుందేమో.. !