అనర్హత వేటుపై అజహర్ రియాక్షన్

హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌నే తొలగిస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ వ్యవహారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో సంచలనాత్మకం అవుతోంది. ఈ వివాదంపై అజహర్ స్పందించారు.

తనపై అనర్హత వేటు వేసే హక్కు అపెక్స్ కౌన్సిల్‌కు లేదని తేల్చారు. హెచ్‌సీఏ కార్యవర్గాన్ని రద్దు చేసే అధికారం అంబుడ్స్‌మెన్‌కు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. నిజానికి అంబుడ్స్‌మన్‌గా తన ఆత్మీయుడ్ని ఇటీవలే అజహర్ నియమించుకున్నారు. అది కూడా వివాదాస్పమయింది. 

అయితే అపెక్స్ కౌన్సిల్ కూడా అజహర్‌కు ఘాటుగానే సమాధానం పంపింది. జస్టిస్‌ లోధా సిఫార్సుల మేరకే అజారుద్దీన్‌ను తొలగించామని.. నేటి నుంచి అజహరుద్దీన్‌ హెచ్‌సీఏ అధ్యక్షుడు కాదని ప్రకటించారు. హెచ్‌సీఏ భేటీలకు అజహర్‌ అధ్యక్షుడిగా రాలేరని స్ఫష్టం చేశారు. అయితే అజహర్ మాత్రం మరోసారి ఎన్నికలకు రెడీ అంటున్నారు.