మోహన్ బాబు సినిమాలోనూ చిరు.. !

చిరంజీవి-మోహ‌న్ బాబు బయటికి శత్రువుల్లా కనిపిస్తారు. కానీ వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. మోహన్ బాబు కోసం ఏం చేయడానికైనా చిరు సిద్ధం. మోహన్ బాబు అంతే. ఈ మధ్య స‌న్ ఆఫ్ ఇండియా టీజ‌ర్ కి చిరు త‌న వాయిస్ ఓవ‌ర్ అందించాడు. ఇప్పుడు మ‌రోసారి అలాంటి సాయ‌మే చేయ‌బోతున్న‌ట్టు టాక్‌.

చిరు వాయిస్ ఓవ‌ర్ ని టీజ‌ర్ కే ప‌రిమితం చేయ‌డం లేదు. సినిమాలోనూ వినిపిస్తారట. ఈ సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నింటినీ చిరు త‌న గొంతు తో ప‌రిచ‌యం చేస్తార‌ని సమాచారమ్. అంతేకాదు.. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ఓ భారీ ఫంక్ష‌న్ ఏర్పాటు చేసి, దానికి చిరంజీవిని చీఫ్‌ గెస్ట్ గా పిల‌వాల‌న్న‌ది మోహ‌న్ బాబు ఆలోచ‌న‌. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టాక.. ఆ ఫంక్షన్ ఉంటుందని తెలిసింది. మొత్తానికి.. తన సినిమా ప్రమోషన్ అంతా చిరుతో కానిచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు మోహన్ బాబు. మరీ.. మెగా మైలేజ్ ఏ మేరకు వస్తుందో చూడాలి.