ధనుష్ డైరక్ట్ తెలుగు సినిమా.. రేపే ప్రకటన !

కోలీవుడ్ స్టార్ ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయ్. ఇప్పుడవి నిజం కాబోతున్నాయి. ఈ సినిమా అధికారిక ప్రకటన రేపు రాబోతోంది. దర్శకుడు ఎవరు ? నిర్మాత ఎవరు ? బడ్జెట్ ఎంత ?? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ సినిమా ఒకేసారి రెడీ కానుంది. ధనుష్ కు హిందీ లో నేరుగా చేయడం కొత్త కాదు. తెలుగులో నేరుగా చేయడం ఇదే ప్రధమం. కాస్త భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే రేపటి వరకు ఓపిక పట్టాల్సిందే.