దూకుడు 2 రాదు

శ్రీను వైట్లతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు ‘దూకుడు’ చూపించిన సంగతి తెలిసిందే. అది ప్రేక్షకులకి బాగా నచ్చింది. బాగా ఎంజాయ్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. మరోసారి మహేష్ దూకుడు చూపిస్తే చూడాలని ఆశపడుతున్నారు. అప్పట్లో దూకుడు 2 ఉంటుందనే ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై దర్శకుడు శ్రీనువైట్ల క్లారిటీ ఇచ్చారు. 

“దూకుడు 2 రాదు. అస‌లు ఆ ఆలోచ‌నే నాకు లేదు. ఎప్పుడైనా స‌రే, కొత్త క‌థ‌ల‌తోనే మ్యాజిక్ చేయ‌గ‌లం. మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు మ‌రోసారి వెళ్తే.. దూకుడు కంటే మంచి క‌థ‌తో వెళ్లాలి..“ అని చెప్పుకొచ్చాడు శ్రీ‌నువైట్ల‌. ప్రస్తుతం శ్రీను వైట్ల ‘ఢీ అండ్ ఢీ’ సినిమా చేస్తున్నారు. ఇది కూడా ఢీ సీక్వెల్ కాదట. పూర్తిగా కొత్త కథతో తీస్తున్న సినిమా అని క్లారిటీ ఇచ్చారు.