గౌతమ్ స్విమ్మింగ్‌ రికార్డు

సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ మంచి ఈతగాడు. స్విమ్మింగ్‌లో రికార్డు నెలకొల్పాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టాప్ 8 ఈతగాళ్ల జాబితాలో స్థానం సంపాదించి, శెభాష్ అనిపించుకున్నాడు. ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకొంది. 

“2018లో గౌతమ్ ఫ్రొఫెషనల్ స్విమ్మర్‌గా మారాడు.15 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. గౌతమ్‌.. 3 గంటల్లో 5 కి.మీ. దూరాన్ని ఈదగలడని, బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్‌, బ్రెస్ట్ స్ట్రోక్‌, ఫ్రీ స్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొడతాడు” అని నమ్రత తెలిపింది.